Thursday, March 12, 2026
HomeసినిమాDouble Ismart: రామ్, పూరీ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’,

Double Ismart: రామ్, పూరీ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’,

మాసీవ్ బ్లాక్ బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలైయింది. రామ్, డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. పూరి కనెక్ట్స్‌ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రామ్ పుట్టినరోజు (మే 15)కి ఒక రోజు ముందు సినిమా టైటిల్, విడుదల తేదీని అనౌన్స్ నిర్మాణ సంస్థ సీఈవో విషు రెడ్డి ప్రకటించారు. ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి ‘డబుల్ ఇస్మార్ట్’ అని పేరు పెట్టారు.

పూరి జగన్నాధ్ చాలా పెద్ద స్పాన్ కలిగిన కథను రాశారు. అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో హై బడ్జెట్‌తో రూపొందించబడుతుంది. డబుల్ ఇస్మార్ట్ టైటిల్ పోస్టర్‌లో త్రిశూల్స్‌ పై రక్తపు గుర్తులు ఉన్నాయి. ఈ పోస్టర్ ఇస్మార్ట్ శంకర్ సెకండ్ ఫ్రాంచైజీ నేపథ్యం గురించి సూచిస్తోంది. డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది. మహా శివరాత్రికి మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో అనౌన్స్ చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular