Puri big project: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరైన పూరి జగన్నాథ్ ఇప్పుడు ‘లైగర్’మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్ట్ 25న లైగర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతోనే ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘జనగణమన’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారనే సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా ఆయనే తెలియజేశారు.
కాగా.. ‘జనగణమన’ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే పూరి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రకటన వెలువడొచ్చు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను ఆయన పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌ను పూరి.. ఛార్మితో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.
Also Read : ఇంతకీ పూరి ‘జనగణమన’ ఎవరితో?