Saturday, January 18, 2025
Homeసినిమాబాలీవుడ్ హీరోల‌తో పూరీ సినిమాలు

బాలీవుడ్ హీరోల‌తో పూరీ సినిమాలు

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. వ‌రుస ప్లాపుల త‌ర్వాత ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో  మళ్ళీ ట్రాక్ మీదకు వచ్చాడు. ఇక పూరి ప‌ని అయిపోయిందనుకుంటున్న టైమ్ లో ఇస్మార్ట్ శంక‌ర్ పూరీకి మంచి బూస్ట్ ఇచ్చింది.  పూరితో ఒకప్పుడు సినిమా చేయాల‌ని యంగ్ హీరోలు, సీనియ‌ర్ హీరోలు ఎంతో ఇంట్ర‌స్ట్ చూపించేవారు. అయితే.. ఫ్లాపుల్లో ఉన్న‌ప్పుడు ఎవ‌రూ ముందుకు రాలేదు. ఇప్పుడు లైగ‌ర్ మూవీతో మ‌రోసారి పూరి  మరోసారి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు.

లైగ‌ర్ మూవీ ఆగ‌ష్టు 25న రిలీజ్ కానుంది. లైగ‌ర్ కు చాలా బ‌జ్ ఉంది. దీంతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డం ఖాయం అనే టాక్ గ‌ట్టిగా వినిపిస్తోంది. అయితే.. లైగ‌ర్ త‌ర్వాత జ‌న‌గ‌ణ‌మ‌న సినిమా చేస్తున్నాడు. ఆత‌ర్వాత ఎవ‌రితో పూరి సినిమా ఉంటుంది అంటే.. స‌ల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తోంది. ఇటీవల ఇంటర్ వ్యూలో సల్మాన్ ఖాన్ తో కూడా వర్క్ చేయాల్సి ఉందని పూరి జగన్నాథ్ వివరణ ఇచ్చాడు.  పూరి జగన్నాథ్ పోకిరి సినిమాను సల్మాన్ ఖాన్ హిందీలో వాంటెడ్ గా రీమేక్ చేసి సక్సెస్ కొట్టాడు.

ఇక అప్పటి నుంచి కూడా పూరి సల్మాన్ ఖాన్ తో సినిమా చేయాలని అనుకుంటున్నట్లుగా తెలియజేశాడు. కొన్నిసార్లు వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయట. ఇక లైగర్ సినిమా తర్వాత వర్కౌట్ అయితే ఆయనతో తప్పకుండా చేస్తానన్నారు. ఇక సల్మాన్ ఖాన్ తో పాటు రణ్ బీర్ కపూర్, రణ్ వీర్ సింగ్, అలాగే వరుణ్ ధావ‌న్ వంటి హీరోలతో కూడా సినిమాలు చేయాలని ఉన్నట్లు పూరి జగన్నాథ్ తెలియజేశాడు

Also Read : విజ‌య్, పూరి సోషియో ఫాంట‌సీ మూవీ చేస్తున్నారా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్