Monday, February 24, 2025
HomeTrending NewsPawan: జనసేనానికి అర్చకులు, ఫాదర్ల ఆశీర్వాదం

Pawan: జనసేనానికి అర్చకులు, ఫాదర్ల ఆశీర్వాదం

నరసాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను పురోహితులు, పాస్టర్లు కలుసుకుని ఆశీర్వాదం అందించారు.  పవన్ కు సకల శుభాలు కలగాలని, ఆయన సంకల్పం సిద్ధించాలని నరసాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రధాన దేవాలయాల అర్చక స్వాములు ఆశీర్వదించారు.  పవిత్ర వస్త్రాలు అందించి వేదాశీర్వచనం ఇచ్చారు. వారాహికి ఎదురులేకుండా కార్యక్రమం సజావుగా సాగేలా ముక్కోటి దేవతల కరుణ పవన్ మీద ఉండాలని ఆకాంక్షిస్తూ వేద మంత్రోచ్చారణలు చేశారు.

పవన్ వీరాభిమాని, బధిరుడైన భాస్కర్ సైతం జనసేనాని విజయాన్ని ఆకాంక్షిస్తూ నిండైన మనసుతో సంకల్పం చేశారు.

అనంతరం నరసాపురం క్రైస్ట్ లూథరన్ చర్చికి చెందిన పాస్టర్లు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. బైబిల్ వాక్యం చదివి ఆశీర్వాదాలు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్