Saturday, September 21, 2024
HomeసినిమాPushpa 2: 'పుష్ప 2' మళ్లీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

Pushpa 2: ‘పుష్ప 2’ మళ్లీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘పుష్ప 2’. ఈ చిత్రం ఆమధ్య వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంది. ఆతర్వాత హైదరాబాద్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 గ్లింప్స్ రిలీజ్ చేశారు. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. సౌత్ లో కంటే నార్త్ లో ఎక్కువుగా రెస్పాన్స్ వచ్చింది. దీనిని బట్టి పుష్ప 2 కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 100 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి యూట్యూబ్ లో దూసుకెళుతుంది.

అయితే.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న షూటింగ్ కి బ్రేక్ పడింది. కారణం.. మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్, సుకుమార్ ఆఫీస్లో ఇన్ కమ్ టాక్స్ సోదాలు చేయడం. ఈ సోదాల్లో 700 కోట్లు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్టుగా లెక్క తేలిందని… ఆ 700 కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి..? ఎలా వచ్చాయి.? అనేది తేలాల్సివుందని వార్తలు వస్తున్నాయి. అయితే… పుష్ప 2 షూటింగ్ ఆగిపోవడంతో అల్లు అర్జున్ ముంబాయి వెళ్లారు. అక్కడ టీ సీరిస్ తో చేయనున్న సినిమాకి సంబంధించి డిస్కసన్స్ లో పాల్గొన్నాడు.

అల్లు అర్జున్ తో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ చాలా గ్రాండ్ గా నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఇటీవల అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అనేది తెలియాల్సివుంది. మరి.. పుష్ప 2 షూటింగ్ మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే… మే నెలాఖరు నుంచి లేదా జూన్ నెలలో సెట్స్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్