Saturday, January 18, 2025
Homeసినిమా'పుష్ప 2' కు మళ్లీ ఆగిందా..?

‘పుష్ప 2’ కు మళ్లీ ఆగిందా..?

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో ‘పుష్ప 2’ మూవీ చేస్తున్నాడు. పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన పుష్ప 2 గ్లింప్స్ కు అనూహ్య స్పందన వచ్చింది. చాలా తక్కువ టైమ్ లోనే 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ తో సాధించి సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ బడ్జెట్ విషయంలో ఎలాంటి పరిమితులు పెట్టుకోకుండా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తోంది.

ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే.. ఆమధ్య మైత్రీ మూవీ పై ఐటీ సోదాలు నిర్వహించిన నేపధ్యంలో షూటింగ్ బ్రేక్ పడింది. ఇప్పుడు మరోసారి ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడిందని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. సుకుమార్ ప్రస్తుతం తన కూతురు మ్యూజిక్ క్రాస్ కోర్స్ కోసం అమెరికా వెళ్ళారు. అక్కడే కొద్ది రోజుల పాటు ఉంటారని తెలుస్తోంది. ఈ కారణంగా పుష్ప 2 మూవీ షూటింగ్ వాయిదా వేసినట్లు ఇండస్ట్రీ వర్గాల లో వినిపిస్తోన్న మాట. అక్కడ ఓ పది రోజులు ఉంటారని.. వచ్చిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తారని టాక్.

అయితే.. ఖచ్చితంగా ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. ఇప్పటి వరకు యాభై శాతం షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదని తెలిసింది. ఈ సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. గ్లింప్స్ కు వచ్చిన రెస్పాన్స్ తో బాలీవుడ్ మార్కెట్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. షూటింగ్ మొత్తం పూర్తైన తర్వాత రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటిస్తారట. మరి.. ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్