Wednesday, September 25, 2024
HomeసినిమాPushpa: పుష్పరాజ్ ఎక్కడున్నాడు?

Pushpa: పుష్పరాజ్ ఎక్కడున్నాడు?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో…. రూపొందిన చిత్రం పుష్ప సంచలన విజయం నమోదు చేసుకుంది. దీనికి సీక్వెల్ గా వస్తున్న ‘పుష్ప 2’ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల రిలీజ్ చేసిన పుష్ప 2 గ్లింప్స్ 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది.

అయితే.. మైత్రీ సంస్థ పై ఇన్ కమ్ టాక్స్ అధికారులు సోదాలు చేయడంతో ‘పుష్ప 2’ షూటింగ్ కి బ్రేక్ పడిందని వార్తలొచ్చాయి. ఇంతకీ పుష్పరాజ్ ఎక్కడ ఉన్నాడు..? లేటెస్ట్ అప్ డేట్ ఏంటి..? అంటే.. మూడు రోజులుగా ఆంధ్రా-ఒరిస్సా ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. సరిగ్గా సీలేరు నదిని అనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఇది దట్టమైన అటవీ ప్రాంతం. ఒరిస్సా సరిహద్దు కావడంతో  దీన్ని నక్సల్స్ ఏరియాగా పరిగణిస్తారు.

ఇంకా చెప్పాలంటే.. సరిహద్దులు దాటి వెళ్లడానికి వీలు లేని ప్రాంతం. అలాంటి లోకేషన్ లో షూటింగ్ చేస్తున్నారు. గతంలో ఇదే ఏరియాలో పుష్ప షూటింగ్ కూడా జరిగింది. పుష్ప 2 గ్లింప్స్ కు వచ్చిన రెస్సాన్స్ తో రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ భారీ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. వచ్చే సంవత్సరం సమ్మర్ లో పుష్ప 2 విడుదల కానుందని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్