Saturday, January 18, 2025
Homeసినిమా'పుష్ప 2' ఫస్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా?

‘పుష్ప 2’ ఫస్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా?

అల్లు అర్జున్,  సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ సినిమా రిలీజైన అన్ని భాష‌ల్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. దీనికి సీక్వెల్ గా వస్తున్న  ‘పుష్ప 2’ ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఇటీవలే మొదలైంది.

పుష్ప 2 షూటింగ్ ఎక్క‌డ చేయ‌నున్నారు..? ఇందులో కొత్త‌గా ఎవ‌రైనా న‌టిస్తున్నారా..?  లేక పుష్ప‌లో న‌టించిన వాళ్లే పుష్ప 2 లో కూడా న‌టిస్తారా..?  ఇలా అనేక ప్ర‌శ్న‌లు. లేట‌స్ట్ అప్ డేట్ ఏంటంటే… పుష్ప 2 ఫ‌స్ట్ షెడ్యూల్ ను హైద‌రాబాద్ లోనే ప్లాన్ చేశార‌ట‌. బ‌న్నీ పై కీల‌క స‌న్నివేశాల‌తో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నార‌ట‌. దీనికి సంబంధించి లోకేష‌న్స్ ఫైన‌ల్ చేసే ప‌నిలో సుకుమార్ టీమ్ ఉంద‌ని స‌మాచారం.

విదేశాల్లో కూడా షూటింగ్ ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఇక కొత్త‌గా న‌టించే న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. కోలీవుడ్, బాలీవుడ్ నుంచి ఒక‌రిద్ద‌రిని తీసుకున్నార‌ని తెలిసింది. అయితే.. వాళ్లు ఎవ‌రు అనేది తెలియాల్సివుంది. మొత్తానికి పుష్ప 2 అంచ‌నాల‌కు మించి ఉండేలా సుకుమార్ ప్లాన్ చేశారు.

Also Read : పుష్ప 2 పై దేవి మ్యూజిక్ ట్యూన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్