Saturday, January 18, 2025
Homeసినిమా'పుష్ప 2' సెట్స్ పైకి ఎప్పుడు? రిలీజ్ ఎప్పుడు?

‘పుష్ప 2’ సెట్స్ పైకి ఎప్పుడు? రిలీజ్ ఎప్పుడు?

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో ఏమాత్రం ప్ర‌చారం చేయ‌క‌పోయినా.. అక్క‌డ 100 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేయ‌డం విశేషం. దీంతో పుష్ప 2 పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండ‌స్ట్రీలోనూ భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఎప్పుడెప్పుడు పుష్ప 2 సెట్స్ పైకి వెళుతుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్.

అయితే.. ఈ సినిమా షూటింగ్ మార్చి నుంచి స్టార్ట్  చేసి  డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. అనుకోవ‌డ‌మే కాదు.. ప్ర‌క‌టించారు కూడా. అయితే.. పుష్ప సినిమా అంచ‌నాల‌కు మించి విజ‌యం సాధించ‌డం.. పుష్ప 2 పై భారీ అంచ‌నాలు ఉండ‌డంతో స్టోరీపై బాగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. అందుక‌నే షూటింగ్ ఆల‌స్యం అవుతోంది.

తాజా వార్త ఏంటంటే.. 400 కోట్ల భారీ బ‌డ్జెట్ తో పుష్ప 2 చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా.. భారీగా రూపొందించేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.  జూలై నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి  వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  జ‌న‌వ‌రికి షూటింగ్ కంప్లీట్ చేసి నాలుగు నెల‌లు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చేసి స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయాలనేది తాజా ప్లాన్.

Also Read : పుష్ప 2 కోసం.. సుకుమార్ భారీ ప్లాన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్