Saturday, January 18, 2025
Homeసినిమా'పుష్ప 2' అప్ డేట్ ఇచ్చిన ర‌ష్మిక‌

‘పుష్ప 2’ అప్ డేట్ ఇచ్చిన ర‌ష్మిక‌

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన పుష్ప‌ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే. బాలీవుడ్ బాక్సాఫీస్ ని  కూడా షేక్ చేయ‌డంతో పుష్ప 2 కోసం అభిమానులు, సౌత్ జ‌నాలు మాత్ర‌మే కాకుండా నార్త్ ప్రేకషకులు కూడా  కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇటీవ‌లే ‘పుష్ప 2’ ని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు కానీ.. ఎప్ప‌టి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారో క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే.. ఈ సినిమాలో బ‌న్నీ స‌ర‌స‌న న‌టిస్తున్న ర‌ష్మిక షూటింగ్ గురించి క్లారిటీ ఇచ్చింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే… హిందీలో గుడ్ బై చిత్రంలో అమితాబ్ కూతురుగా ర‌ష్మిక న‌టించింది. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంలో రష్మిక మాట్లాడుతూ.. అమితాబ్ గారితో కలిసి నటించాలనే తన కల నిజమైందంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 సినిమాను గురించి రష్మిక ప్రస్తావించింది. పుష్ప 2 సినిమా మరో రెండు రోజుల్లో సెట్ పైకి వెళుతున్నట్టుగా ఆమె చెప్పింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ విధంగా ర‌ష్మిక గుడ్ న్యూస్ చెప్పింది.

Also Read :‘పుష్ప 2’ ఫస్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్