Sunday, January 19, 2025
HomeసినిమాAllu Arjun: 'పుష్ప 2' టీజర్ రిలీజ్ ఎప్పుడు?

Allu Arjun: ‘పుష్ప 2’ టీజర్ రిలీజ్ ఎప్పుడు?

అల్లు అర్జున్, సుకుమార్.. కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప 2. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిసొంది. పుష్పదాదాపు 400 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. సౌత్ లో కంటే నార్త్ లోనే రికార్డ్ కలెక్షన్ వసూలు చేయడం విశేషం.  అందుకే పుష్ప 2 పై సౌత్ లో కంటే నార్త్ లోనే భారీగా క్రేజ్ ఉంది. ఇటీవల పుష్ప 2 గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. యూట్యూబ్ ని షేక్ చేసింది. 100కు పైగా మిలియన్స్ వ్యూస్ తో దూసుకెళ్లింది.

ఇటీవల పుష్ప 2 నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడంతో బన్నీ ఆర్మీ ఫైర్ అవుతున్నారు. అప్ డేట్ ఇవ్వాలంటూ నిర్మాణ సంస్థకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. పుష్ప 2 టీజర్ కు ముహూర్తం ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 24న టీజర్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

దేవిశ్రీప్రసాద్ పుష్ప సినిమాలో పాటల కంటే అంతకు మించి అనేలా ఉండే సాంగ్స్ ఇచ్చారట. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ అనేలా ఉంటాయని.. సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమని టీమ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా  విడుదల చేయనున్నారు. పుష్పను మించి… పుష్ప 2 సరికొత్త రికార్డులు సెట్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్