Tuesday, September 24, 2024
Homeసినిమా‘పుష్ప’ సెన్సార్ పూర్తి: 17న పార్టీ బిగిన్స్  

‘పుష్ప’ సెన్సార్ పూర్తి: 17న పార్టీ బిగిన్స్  

Pushpa: Party Begins:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్టు పుష్ప. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి ఫోటో, పోస్టర్, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మిగిలిన భాషల్లో కూడా పుష్ప సినిమాకు విశేష ఆదరణ వస్తోంది.

ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూ ట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ అందుకుంటుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ దర్శకత్వం ప్రతిభ పుష్ప సినిమా స్థాయిని పెంచేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 12న హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో జరగనున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

Also Read : జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదు : చంద్రబోస్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్