Monday, September 30, 2024
Homeసినిమాబుల్లితెరపైనా పుష్ప‌ సెన్సేష‌న్

బుల్లితెరపైనా పుష్ప‌ సెన్సేష‌న్

on TV also: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌ బాలీవుడ్ ని షేక్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే ఓవ‌ర్ సీస్ లో సైతం సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో పుష్ప 2 పై మ‌రింత క్రేజ్ పెరిగింది. ఇంకా పుష్ప 2 సెట్స్ పైకి వెళ్ల‌కుండానే థియేట్రిక‌ల్ రైట్స్ కోసం భారీ పోటీ ఏర్ప‌డింది.

ఇదిలా ఉంటే.. వెండితెరపై రికార్డులు  మోగించిన పుష్ప బుల్లితెర పై కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మొదటిసారి టీవీల్లో ప్ర‌సారం చేసిన‌ప్పుడు 22.54 టీఆర్పీ రేటింగ్ సాధించింది. రెండోసారి 12.87 టీఆర్పీ న‌మోదు చేసింది. మూడోసారి 9.59 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇలా పుష్ప మూవీ టీవీల్లో మూడు సార్లు మంచి రేటింగ్ సాధించ‌డం విశేషం. దీనిని బ‌ట్టి పుష్ప మూవీకి ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

ఇక పుష్ప 2 విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఆగ‌ష్టు లేదా సెప్టెంబ‌ర్ నుంచి ఈ క్రేజీ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంచ‌నాలకు మించి ఉండేలా పుష్ప 2ను సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 400 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నార‌ని స‌మాచారం. 2023 చివ‌ర‌ల్లో లేదా 2024లో పుష్ప 2 చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయ‌నున్నార‌ని టాక్.

Also Read : పుష్ప-2లో రెండో హీరోయిన్? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్