Sunday, January 19, 2025
Homeసినిమారష్యాలో 'పుష్ప' కలెక్షన్ ఎంత.?

రష్యాలో ‘పుష్ప’ కలెక్షన్ ఎంత.?

అల్లు అర్జున్ సంచలనం ‘పుష్ప’. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇది ఇద్దరికీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఎలాంటి విజయం సాధిస్తుందో అనుకుంటే… అంచనాలకు మించి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే.. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాలీవుడ్ మేకర్స్ కి షాక్ ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే.. టాలీవుడ్ లో కన్నా బాలీవుడ్ లోనే ఎక్కువ లాభాలు వచ్చాయని చెప్పచ్చు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 400 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ‘పుష్ప 2’ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇదిలా ఉంటే.. ఇటీవల రష్యాలో పుష్ప చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. అక్కడకి వెళ్లి పుష్ప టీమ్ బాగా ప్రమోషన్స్ కూడా చేసింది. దీంతో రష్యాలో పుష్ప ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. డిసెంబర్ 8, 2022న రష్యాలో పుష్ప మూవీ విడుదలైంది. మేకర్స్ నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం… ఈ చిత్రం రష్యాలో సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం రష్యన్ బాక్సాఫీస్ వద్ద 25 రోజులకు 10 మిలియన్ రూబిళ్లు వసూలు చేసింది. ఇప్పటికీ దేశంలోని 774కి పైగా స్క్రీన్లలో ఈ సినిమా విజయవంతంగా రన్ అవుతోంది.

అక్కడ కూడా చిత్రం మంచి వసూళ్లను రాబట్టడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. పుష్ప సీక్వెల్‌ పుష్ప ది రూల్ చిత్రం షూటింగ్ ను సుకుమార్ గత నెలలో ప్రారంభించాడు. అల్లు అర్జున్ అతి త్వరలో సెట్స్‌లో జాయిన్ అవుతాడు. రష్మిక మందన్న, అనసూయ భరద్వాజ్, ఫహద్ ఫాసిల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప 2 కోసం బడ్జెట్ లిమిటేషన్ అంటూ ఏమీ పెట్టుకోకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి.. పుష్ప 2 చరిత్ర సృష్టిస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్