Tuesday, March 10, 2026
Homeసినిమా‘పుష్ప’ విలన్ ఫహాద్ ఫాజిల్‌కు బర్త్ డే విషెస్

‘పుష్ప’ విలన్ ఫహాద్ ఫాజిల్‌కు బర్త్ డే విషెస్

అల వైకుఠ‌పురంలో.. ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప వస్తుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, మొన్నటికి మొన్న విడుదలైన తొలి పాటకు సంబంధించిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఫ‌హాద్ న‌టించిన ప‌లు మ‌ళ‌యాలీ చిత్రాలు తెలుగుతో పాటు పాన్ ఇండియా వైడ్ సినీ అభిమానుల ఆద‌ర‌ణ దక్కించుకున్నాయి. ఆగస్ట్ 8న ఫహాద్ జన్మదినం సందర్భంగా పుష్ప చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఓ పోస్టర్ విడుదల చేసారు. EVIL WAS NEVER SO DANGEROUS అంటూ పోస్టర్‌ పై రాసుకొచ్చారు. దీన్ని బట్టి ఫహాద్ పాత్రను సుకుమార్ ఎలా డిజైన్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఫహాద్ ఫాజిల్ కన్ను హైలైట్ చేస్తున్న ఈ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా పుష్ప 1 విడుదల కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular