Saturday, January 18, 2025
Homeసినిమాపుష్ప 2 రిలీజ్ అప్ డేట్ ఇప్పట్లో లేదా?

పుష్ప 2 రిలీజ్ అప్ డేట్ ఇప్పట్లో లేదా?

అల్లు అర్జున్ కెరీర్ లోనే కాదు.. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ టైమ్ లో రెగ్యులర్ కమర్షియల్ అనుకున్నారు. ఇంకా చెప్పాలంటే.. అంతగా పాజిటివ్ టాక్ కూడా రాలేదు. బాగానే ఉందనే టాక్ వచ్చింది. ఆ తర్వాత రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్లింది. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే.. ఊహించని విధంగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం. దీంతో పుష్ప రేంజ్ మారిపోయింది.

ఇప్పుడు పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంతో పుష్ప 2 పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం ఈ చిత్రం రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల పుష్ప 2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని.. మార్చి 22న పుష్ప 2 విడుదల చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా అతి త్వరలోనే పుష్ప 2 రిలీజ్ అనౌన్స్ మెంట్ ఉంటుందని కూడా టాక్ వచ్చింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు పుష్ప 2 రిలీజ్ డేట్ ప్రకటిస్తారా..? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్త ఏంటంటే… ఇప్పట్లో పుష్ప 2 రిలీజ్ డేట్ ను ప్రకటించే ఆలోచనలో లేరట మేకర్స్. ప్రస్తుతం పుష్ప 2 ను బాగా అంచనాలకు తగ్గట్టుగా తీయాలనే ఆలోచనలోనే ఉన్నారట. షూటింగ్ పూర్తయిన తర్వాతే రిలీజ్ డేట్ గురించి ఆలోచించాలనుకుంటున్నారట. పుష్ప సినిమా విషయంలో జరిగినట్టుగా హాడావిడిగా చేయాలి అనుకోవడం లేదట. ఈసారి పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అందుచేత పుష్ప 2 రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఇప్పట్లో ఉండదు అని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్