Tuesday, March 10, 2026
Homeసినిమామిలియన్ వ్యూస్ దాటిన "పుష్పక విమానం" సాంగ్

మిలియన్ వ్యూస్ దాటిన “పుష్పక విమానం” సాంగ్

ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా “పుష్పక విమానం” నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ‘కళ్యాణం..’ లిరికల్ సాంగ్ వన్ మిలియన్ వ్యూస్ ఫీట్ సాధించింది. సమంత విడదల చేసిన ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వివాహ వేడుకల నేపథ్యంగా వచ్చే ‘కళ్యాణం..’ పాట..ఇప్పడున్న పెళ్లిల్ల సీజన్ లో మార్మోగుతోంది. రామ్ మిరియాల బ్యుటిఫుల్ గా కంపోజ్ చేసిన ఈ పాటను మంగ్లీ, సిధ్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు. పెళ్లిని అంకెలతో పోల్చూతూ అద్భుతంగా రాశారు గీత రచయిత కాసర్ల శ్యాం. వీరందరి శర్మ ప్రేక్షక ఆదరణతో తేట తెల్లమవుతోంది. భవిష్యత్తులో ఈ పాట మరిన్ని రికార్డులు స్తాదిస్తుందో వేచి చూడాలి.

ఆనంద్ దేవరకొండ సరసన గీత్ సైని నాయికగా నటిస్తోంది. నూతన దర్శకుడు దామోదర రూపొందిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. ‘కింగ్ అఫ్ ది హిల్’, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది “పుష్పక విమానం”.

నటీనటులు – ఆనంద్ దేవరకొండ , గీత్ సైని, శాన్వి మేఘన, సునీల్, నరేష్, హర్షవర్థన్, గిరిధర్, కిరీటి, భద్రం, వైవా హర్ష, అభిజిత్, అజయ్, సుదర్శన్, శరణ్య, మీనా వాసు, షేకింగ్ శేషు తదితరులు, సాంకేతిక నిపుణులు – సమర్పణ : విజయ్ దేవరకొండ, పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా,  సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, నేపథ్య సంగీతం : మార్క్ కె.రాబిన్, కాస్టూమ్స్ : భరత్ గాంధీ, నిర్మాతలు:  గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి, రచన-దర్శకత్వం: దామోదర.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular