Sunday, January 19, 2025
Homeసినిమారవితేజ జోడీగా రాశీఖన్నా..

రవితేజ జోడీగా రాశీఖన్నా..

రాశీఖన్నాకు గత కొంతకాలంగా తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. అయితే హిందీ, తమిళ ఇండస్ట్రీల్లో మాత్రం అవకాశాలను దక్కించుకుంటున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ తెలుగులో భారీ ఆఫర్‌ను దక్కించుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..రవితేజ, గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

హ్యాట్రిక్‌ హిట్‌ తర్వాత రవితేజ-గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమాలో రెండో నాయికగా రాశీఖన్నా పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. దాదాపుగా ఆమె ఖరారయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ భామ హిందీ, తమిళంలో రెండేసి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్