Sunday, January 19, 2025
Homeసినిమా యు.ఎస్ లో రాధేశ్యామ్ రికార్డ్

 యు.ఎస్ లో రాధేశ్యామ్ రికార్డ్

Record in US: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే జంట‌గా న‌టించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భారీ పిరియాడిక్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యు.వి క్రియేష‌న్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన ఈ పాన్ ఇండియా మూవీని మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ నేపధ్యంలో ప్రమోషన్స్‌ని కూడా మేకర్స్ మళ్లీ షురూ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని యు.ఎస్ లో భారీ స్థాయిలో రిలీజ్  చేయ‌డానికి ప్లాన్ చేశారు. తాజా సమాచారం ప్రకారం… యూఎస్‌లో అత్యధిక లొకేషన్స్‌లో ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీదుగా అక్కడ 1116 ప్లస్ లొకేషన్లలో, 3116 ప్లస్ స్క్రీన్స్‌పై, 11116 ప్లస్ షోలు పడబోతున్నాయి. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. అయితే.. యూఎస్‌లో ఇన్ని లొకేషన్స్‌లో విడుదలవుతున్న తొలి హీరో ప్రభాస్ కావడం విశేషం.

ఈ విధంగా రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కి ముందే యు.ఎస్. లో స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రిలీజ్ కి ముందే ఇలా రికార్డులు క్రియేట్ చేస్తుంటే.. ఇక రిలీజ్ త‌ర్వాత ఏ రేంజ్ స‌క్స‌స్ సాధిస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది. దీంతో రాధేశ్యామ్… బాహుబ‌లి వ‌లే చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయ‌మ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి.. రాధేశ్యామ్ ఏ రేంజ్ స‌క్స‌స్ సాధిస్తుందో చూడాలి.

Also Read : రాధే శ్యామ్ ‘ఈ రాతలే’ పాట ప్రోమోకు ట్రెమండ‌స్ రెస్పాన్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్