Radisson Hotel : రాడిసన్ హోటల్ లైసెన్స్ రద్దు చేసిన రాష్ట్ర అభ్కారి శాఖ. పబ్, లిక్కర్ లైసెన్స్‌లు రద్దు చేసిన ఎక్సైజ్ శాఖ. 24 గంటలపాటు లిక్కర్ సప్లైకి అనుమతి తీసుకున్న రాడిసన్ హోటల్, జనవరి 7న లిక్కర్ లైసెన్స్‌కి అనుమతి తీసుకున్న హోటల్ నిర్వాహకులు రూ. 56 లక్షల బార్ ట్యాక్స్ చెల్లించి లైసెన్స్ పొందారు. 2బీ బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో అనుమతి.
హైదరాబాద్ లోని రాడిసిన్ బ్లూ ప్లాజా హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ లో మత్తు మందులు స్వాధీనం చేసుకున్న సంఘటన పై రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. రాడిసిన్ బ్లూ ప్లాజా హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ యాజమాన్యం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ రూల్స్ ను violation చేసినందుకు U/s 31 of EXCISE ACT ప్రకారం Pub మరియు Bar లైసెన్స్ ను తక్షణమే రద్దు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ను ఆదేశించారు.
డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ వినియోగం, అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్రంలో ఉన్న పబ్ యజమానులతో గతంలో (31.01.2022) హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా హోటల్ లో సమన్వయ సమావేశం నిర్వహించారు. పబ్ లలో డ్రగ్స్ వినియోగం జరగకుండా పబ్ యజమానులే బాధ్యత వహించాలని గత సమావేశంలో పబ్ యజమానులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగంపై పబ్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తే వారి లైసెన్స్ రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. నిబందనలు పాటించని పబ్ ఓనర్లు ఎంతటివారైన ఉపేక్షించేది లేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. నిన్నటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు.
డ్రగ్స్ నిర్ములన లో భాగంగా
రాడిసిన్ బ్లూ ప్లాజా హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారన్నారు. నిబంధనలు పాటించని అన్ని పబ్ లు, బార్స్ పై నిరంతరం దాడులను కంటిన్యూ చేస్తామని బార్, పబ్ యజమానులను హెచ్చరించారు. డ్రగ్స్ రాకెట్ కు సంబందం ఉన్న ఎంతటివారి నైనా ఉపేక్షించేది లేదన్నారు. కఠినంగా శిక్షించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆబ్కారీ శాఖ అధికారులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కంటిన్యూ గా పబ్ , బార్ల పై నిఘా పెట్టి ఎవరైతే నిబంధనలు పాటించకుండా బార్, పబ్ లను నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్ములనే లక్ష్యం గా ఆబ్కారీ శాఖ అధికారులు కృషి చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఆదేశించారు.
Also Read : సెలెబ్రిటీ న్యూస్ వ్యాల్యూ