Sunday, January 19, 2025
Homeసినిమాఇండస్ట్రీని వాయించేస్తాడని ఆరోజే అనుకున్నా: రాఘవేంద్రరావు  

ఇండస్ట్రీని వాయించేస్తాడని ఆరోజే అనుకున్నా: రాఘవేంద్రరావు  

రవితేజ కథానాయకుడిగా దర్శకుడు నక్కిన త్రినాథరావు ‘ధమాకా‘ సినిమా రూపొందించాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ కి చెందిన కథ ఇది. విశ్వప్రసాద్ – వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకి భీమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు. కథానాయికగా శ్రీలీల అందాల సందడి చేయనున్న ఈ సినిమాను, ఈ నెల 23వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. ఈ ఫంక్షన్ కి రాఘవేంద్రరావు హాజరయ్యారు.

ఈ స్టేజ్ పై రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. ” రవితేజ నేను చేసిన ‘అల్లరి ప్రియుడు’ సినిమాలో హీరో నడిపే ఆర్కెస్ట్రాలో డ్రమ్స్ వాయించే ఒక చిన్న పాత్రను చేశాడు. అతను ఆ డ్రమ్స్ వాయించే పద్ధతి చూసే, ఏ రోజుకైనా ఇతను ఇండస్ట్రీని వాయించేస్తాడని అనుకున్నాను .. అదే నిజమైంది. తను మాస్ మహారాజ్ గా ఎదిగాడు. నా సినిమా తరువాత ఆయన స్టార్ గా ఎదగడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. ఇక శ్రీలీల కూడా నా సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టడం ఆనందాన్ని కలిగిస్తోంది” అన్నారు.

రవితేజ మాట్లాడుతూ .. ఈ సినిమా తరువాత శ్రీలీల డేట్స్ దొరకవనీ, నెక్స్ట్ ఇయర్ కి ఆమె నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోవడం ఖాయమని అన్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన హైపర్ ఆది మాట్లాడుతూ, “హీరోల్లో రెండు రకాలు ఉంటారనీ .. ఇండస్ట్రీకి వచ్చి పేరు తెచ్చుకునేవారు కొందరైతే, ఇండస్ట్రీకే పేరు తెచ్చేవారు మరికొందరిని అన్నాడు. అలా ఇండస్ట్రీకే పేరు తెచ్చిన హీరో రవితేజ గారని చెప్పుకొచ్చాడు. ఇది ఈ ఏడాది రవితేజ నుంచి వస్తున్న మూడో సినిమా అనే సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్