Sunday, September 29, 2024
Homeసినిమా‘వాంటెడ్ పండు గాడ్’ అంద‌రికీ న‌చ్చే సినిమా : రాఘ‌వేంద్ర‌రావు

‘వాంటెడ్ పండు గాడ్’ అంద‌రికీ న‌చ్చే సినిమా : రాఘ‌వేంద్ర‌రావు

Another Pandu:  శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు.. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. ఈ సందర్భంగా హైద‌రాబాద్‌లో మీడియా సమావేశం జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ… ‘ఎంట‌ర్‌టైన్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి క‌థ నాకు వినిపించారు. హిలేరియ‌స్‌గా అనిపించింది. నిజానికి త‌నికెళ్ల భ‌ర‌ణి గారు ఈ సినిమాను డైరెక్ట్ చేద్దామ‌ని అనుకున్నారు. పెళ్లి సంద‌D సినిమాకు శ్రీధ‌ర్ సీపాన అద్భుత‌మైన డైలాగ్స్‌ను అందించాడు. దాంతో త‌నే వాంటెడ్ పండుగాడ్ సినిమాను డైరెక్ట్ చేస్తే బావుంటుంద‌నిపించింది. పి.ఆర్ సంగీతం, మ‌హి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలుస్తుంది. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌. వీళ్లంద‌రితో క‌లిసి ప‌ని చేయ‌డం వ‌ల్ల నాకు వ‌య‌సు గుర్తుకు రాదు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చ‌క్క‌గా స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌. జూన్ చివ‌రి వారం లేదా జూలై తొలి వారంలో ఈ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది’’ అన్నారు.

Also Read ‘వర్జిన్ స్టోరి’ పాట రిలీజ్ చేసిన రాఘవేంద్రరావు

RELATED ARTICLES

Most Popular

న్యూస్