Friday, November 22, 2024
HomeTrending Newsతెలుగుదేశం పార్టీలో చేరిన రఘురామ: ఉండి నుంచి పోటీ!

తెలుగుదేశం పార్టీలో చేరిన రఘురామ: ఉండి నుంచి పోటీ!

వైఎస్సార్సీపీ మాజీ నేత, నర్సాపురం ఎంపి కనుమూరు రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. పాలకొల్లులో జరిగిన ప్రజాగళం బహిరంగసభలో టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన లాంఛనంగా పార్టీ కండువా కప్పుకున్నారు. 2019 లో వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన రఘురామ ఒక సంవత్సరం తరువాత పార్టీ విధానాలపై విమర్శలు చేస్తూ ఎన్నో సార్లు సిఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఓ కేసులో రఘురామను ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత ఆయన ఢిల్లీ కేంద్రంగా రచ్చబండ పేరిట  జగన్ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూ వార్తల్లో ఉన్నారు. బిజెపి-తెలుగుదేశం-జనసేన కలిసి పోటీ చేస్తాయని సంవత్సరం ముందునుంచీ చెబుతున్న రఘురామ…. నర్సాపురం లోక్ సభ సీటు పొత్తులో భాగంగా ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తామని చెబుతూ వచ్చారు.   పొత్తులో భాగంగా నర్సాపురం బిజెపి ఖాతాలోకి రాగా … పార్టీలో చేరకుండానే తానే అభ్యర్దినని రఘురామ  ప్రకటించుకోవడాన్ని సీరియస్ గా తీసుకున్న బిజెపి ఆయనకు సీటు నిరాకరించి ఆ పార్టీలో ఎప్పటినుంచో కొనసాగుతున్న శ్రీనివాసవర్మను అభ్యర్ధిగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో హతాశుడైన రఘురామ ఇక ఏదో పార్టీలో చేరక తప్పదని తెసులుకొని ఈరోజు టిడిపిలో సభ్యత్వం తీసుకున్నారు.

మరోవైపు, 2014 లో తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన శివరామరాజును 2019లో నర్సాపురం నుంచి ఎంపిగా నిలబెట్టారు కానీ ఆయన ఓటమి పాలయ్యారు. 2019లో ఉండినుంచి గెలుపొందిన మంతెన రామరాజును ఈసారి కూడా టిడిపి బరిలోకి దింపింది. కానీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు శివరామరాజు ప్రకటించి ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. ఆ సీటు నుంచి రఘురామను నిలబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. రెండ్రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్