Sunday, March 8, 2026
HomeTrending Newsరఘురామ ఓ చీడపురుగు : చెరుకువాడ

రఘురామ ఓ చీడపురుగు : చెరుకువాడ

నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు 14 నెలలు నుంచి ఢిల్లీలో కూర్చుని తనను గెలిపించిన ప్రజలను గాలికొదిలేశారని ఏపి గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు విమర్శించారు. వైసిపి ఎంపి మీద ప్రతిపక్ష పార్టీలకు ఎందుకు అంత ప్రత్యేక శ్రద్ధ అంటూ ప్రశ్నించారు.

కొన్నిరోజులుగా రఘురామ ప్రవర్తన అందరూ సిగ్గుపడేలా వుందని, ప్రశాంతంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి ఒక చీడపురుగుని ఎంపీగా ఎన్నుకున్నామని ప్రజలు సిగ్గుపడుతున్నారని వ్యాఖ్యానించారు.

వైఎస్ జగన్ ఫోటో పెట్టుకునే అయన ఎన్నికల్లో గెలుపొందారని, ఇటివల కాలంలో ముఖ్యమంత్రి జగన్ పై అయన చేస్తున్న విమర్శలు దారుణంగా వున్నాయని, కులాలు, మతాల పేరుతో వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను రెచ్చ గోడుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular