కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడోయాత్ర’ ఆంధ్రప్రదేశ్ ప్రవేశించింది. ఉదయం 6.30 గంటలకు కర్నూల్ జిల్లాలోని క్షేత్ర గుడి నుంచి పారంభమైన ఈ పాదయాత్రకు ఉదయం 10.30 గంటలకు ఆలూరు నగర శివారులో విరామం ఇస్తారు. సాయంత్రం అక్కడినుంచి మొదలై ఏడున్నర గంటలకు మణికుర్తి గ్రామంలో నేటి యాత్ర ముగియనుంది. కర్నూలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు ఆలూరు, ఆదోని ఎమ్మిగనూరు, మంత్రాలయంలో నాలుగు రోజులపాటు 119 కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర ఉంటుంది, అక్కడి నుంచి మళ్ళీ కర్నాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది.
రేపు అక్టోబర్ 19న చాగి గ్రామం నుంచి మొదలై రాత్రి గ్రామం జల్లినాగన్న తోటలో ముగుస్తుంది.
ఎల్లుండి 20న చెన్నాపూర్ క్రాస్ రోడ్ నుండి మొదలై కలుదేవకుంట గ్రామంలో ముగియనుంది.
21న ఉదయం 6 గంటలకు మంత్రాలయం గుడి సర్కిల్ నుండి మొదలు కానున్న ఈ యాత్ర పదిన్నర గంటలకు మాధవరం ద్వారా కర్నాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది.
Also Read : దేశ ఐక్యత కోసమే భారత్ జోడో యాత్ర దిగ్విజయ్ సింగ్