Saturday, March 14, 2026
HomeTrending Newsవిద్యార్థి నాయకుల పరామర్శకు రాహుల్ గాంధి

విద్యార్థి నాయకుల పరామర్శకు రాహుల్ గాంధి

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను కలిసేందుకు ఏ ఐ సిసి నేత రాహుల్ గాంధీ వస్తున్నారని విజ్ఞప్తి చేస్తే అనుమతి ఇవ్వకపోగా విద్యార్థి నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలులో వేయటం అమానుషమని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలుకు వచ్చి విద్యార్థి నాయకులను కలుస్తారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబద్ చంచల్ గూడ జైలులో ఉన్న విద్యార్థి నాయకులను పరామర్శించన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ రాకపై చంచల్ గూడ సూపరింటెండెంట్ ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ 7 వ తేదీ న బలమురి వెంకట్ తో పాటు 18 మంది నాయకులను కలవడానికి రాహుల్ గాంధీ తో సహా మేమంతా వస్తామని వివరించారు.

రాహుల్ గాంధి విద్యార్థి నాయకులను కలిసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జైలు సూపరింటెండెంట్ ని కోరామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జైలు అధికారులు స్వతంత్ర గా వ్యవహరించాలని, అనవసరమైన వివాదాలకు తావు ఇవ్వకుండా రాహుల్ గాంధీ పర్యటన కు అనుమతి తో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. రాహుల్ గాంధీ ఓయూ పర్యటన పై విద్యార్థి నేతలు విసి ని కలిశారని, విద్యార్థి సంఘాలు, ఉద్యమకారులు రాహుల్ గాంధీ రావాలని కోరారని ఓయు పర్యటనపై రేవంత్ వివరణ ఇచ్చారు. విశ్వవిద్యాలయం అధికారులు సిఎం కేసీఆర్ ఒత్తడి వల్ల రాహుల్ గాంధీ పర్యటనకు తిరస్కరించారని ఆరోపించారు.

Nsui విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ఈ పర్యటన ఉంటుందని విసి ని విజ్ఞప్తి చేశారని, అక్కడికి వెళ్లిన విద్యార్థి నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో బంధించారని మండిపడ్డారు. ఓయూలో విద్యార్థి నాయకులను కలవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారని, కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్, కేటీఆర్, కవిత ఈరోజు ఎక్కడ ఉండేవారో గుర్తు చేసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : రాహుల్ గాంధి పర్యటన షెడ్యుల్ ఖరారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular