Friday, November 22, 2024
HomeTrending Newsత్వరలోనే రాష్ట్ర పర్యటనకు రాహుల్

త్వరలోనే రాష్ట్ర పర్యటనకు రాహుల్

కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతల్ని కోవర్టులుగా మార్చుకొని కేసీఆర్ రాజకేయ లబ్ది పొందిన విషయాలు గతంలో జరిగాయని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో అన్నారు. మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కోవద్దు.. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పని చేసిన కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని, అది నాతో సహా అందరికి వర్తిస్తుందని రేవంత్ స్పష్టం చేశారు.

ప్రజల్లో, పార్టీలో బాధ్యతాయుతంగా పనులు చేస్తేనే గౌరవం పెరుగుతుందని, అధికార పార్టీతో అప్రమత్తంగా ఉండి పని చేయాలని పార్టీ శ్రేణులకు రేవంత్ పిలుపు ఇచ్చారు. ఆగస్టు 9న ఇంద్రవెళ్లి లో దళిత, గిరిజన దండోరా కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. ఆగస్టు 11 నుంచి 21 వరకు పది రోజుల పాటు 5 మండలాలు, 2 మునిసిపాలిటీ లు తీసుకొని ప్రతి రోజు ఒక ప్రాంతంలో 2, 3 వేల మంది తో ర్యాలీ లు, సమావేశాలు జరపాలి. 7 బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. మండలంలో ఉన్న ఓటర్లలో పది శాతం మీటింగ్ కు వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేయాలని, కాంగ్రెస్ శ్రేణులను ఉప ఎన్నికలకు సిద్ధం చేయాలన్నారు. అనుబంధ సంఘాల నాయకులను క్షేత్ర స్థాయి లో పని చేయించాలి.

రాహుల్ గాంధీతో దళిత దండోరా కార్యక్రమంపై చర్చించామని, దళిత దండోరా కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొంటున్నారని రేవంత్ వెల్లడించారు. సెప్టెంబరు మొదటి వారంలో తెలంగాణ కు రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రాంతం, తేదీ ఎక్కడ, ఎప్పుడు అనేది త్వరలోనే నిర్ణయిస్తామన్నారు.

హుజురాబాద్ లో పార్టీ అభ్యర్థి విషయంలో సామాజిక వర్గం, కార్యకర్తల కోసం పార్టీ కోసం పని చేసే నేతను ఎంపిక చేయాలని, అభ్యర్థి విషయంలో పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజా నర్సింహ లు కలిసి సిఫారసు చేస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్