Saturday, November 23, 2024
HomeTrending Newsతెలంగాణలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

తెలంగాణలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలోని రాయచూరు నుంచి కృష్ణ నది బ్రిడ్జి మీదుగా ఈ రోజు ఉదయం ఆరు గంటల 30 నిమిషాలకు తెలంగాణలోని నారాయణపేట జిల్లాలోకి ప్రవేశించింది. ఇవాళ కేవలం ఐదు కిలోమీటర్ల మేరకే యాత్ర సాగుతుంది. కృష్ణా నది బ్రిడ్జి నుంచి అక్కడికి కిలోమీటర్ దూరంలో ఉన్న అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్ మీదుగా గుడేబల్లూరు వరకు యాత్ర కొనసాగింది. ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల వరకు గుడేబల్లురుకు వరకు చేరుకున్న రాహుల్ గాంధీ తన యాత్రకు మూడు రోజుల పాటు విరామం ఇచ్చారు.

దీపావళి పండుగ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున బాధిత స్వీకార నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు (ఆదివారం) ఢిల్లీకి వెళ్లి మళ్లీ 27న తిరిగి ఆయన యాత్ర చేపడతారు. ఆరోజున మక్తల్ లోని కెవి సబ్ స్టేషన్ నుంచి ఆయన యాత్ర ప్రారంభం అవుతుంది. తెలంగాణలో మొత్తం 12 రోజులపాటు ( నవంబర్ 4వ తేదీన సాధారణ విరామం) పాదయాత్ర సాగుతుంది. రోజు 25 కిలోమీటర్ల మేరకు రాహుల్ గాంధీ నడక సాగుతుంది. ఏడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ 375 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుంది. ప్రతిరోజు పాదయాత్ర అనంతరం కార్నర్ మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఈ యాత్రలో భాగంగా వివిధ రంగాల్లో మేధావులు, సామాజికవేత్తలు, వివిధ సంఘాల నేతలు, రాజకీయ, క్రీడా, వ్యాపార, సినీ రంగాల ప్రముఖులను ఆయన కలుస్తారు. దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, మసీదులు, చారిత్రాత్మక ప్రదేశాలను ఆయన సందర్శిస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్