Wednesday, March 11, 2026
HomeTrending Newsత్వరలో రైల్వే జోన్ కార్యకలాపాలు

త్వరలో రైల్వే జోన్ కార్యకలాపాలు

Vizag – Railway Zone:
విశాఖలో రైల్వే జోన్ కార్యకలాపాలు అతిత్వరలో ప్రారంభిస్తామని రైల్యే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ హామీ ఇచ్చారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ వి. విజయసాయి రెడ్డి, లోక్ సభలో వైసీపీ నేత పీవీ మిధున్‌ రెడ్డి శుక్రవారం అశ్వినీ వైష్ణవ్‌ తో భేటీ అయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా కార్యకలాపాలను ప్రారంభించడంలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని వారు కేంద్ర మంత్రి  దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై స్పందించిన రైల్వే మంత్రి వెంటనే త్వరితగతిన జోన్ పనులు మొదలు పెడతామని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పొందుపరచిన హామీలను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసేలా వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధితో కృషిని కొనసాగిస్తుందని విజయసాయి రెడ్డి, మిధున్‌ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : మాజీ ఐఏఎస్‌కు  ఏపీ సీఐడీ నోటీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular