Wednesday, January 22, 2025
HomeTrending Newsబీఆర్ఎస్ వైపు దేశ రైతాంగం - మంత్రి నిరంజన్ రెడ్డి

బీఆర్ఎస్ వైపు దేశ రైతాంగం – మంత్రి నిరంజన్ రెడ్డి

పదో విడత రైతుబంధు నిధుల జమ కొనసాగుతోంది. 5వ రూ. 265.18 కోట్లు..  లక్ష 51 వేల 368 మంది కర్షకుల ఖాతాల్లో జమయ్యాయి. 5 లక్షల 30 వేల 371.31 ఎకరాలకు నిధులు విడుదల అయ్యాయి. రైతుల కళ్లలో ఆనందమే కేసీఆర్ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరంటు రాక, సాగునీళ్లు లేక రైతాంగం వ్యవసాయం వదిలేసి వలసబాట పట్టారని తెలిపారు.

బోరు బావుల కింద వ్యవసాయం చేయలేక రైతాంగం నష్టాల పాలయ్యారని, కేవలం ఎనిమిదేళ్లలో తెలంగాణ వ్యవసాయరంగ స్వరూపం మారిపోయిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు పథకాలు చారిత్రాత్మకమైనవని, వ్యవసాయరంగం బలపడితేనే దేశం పటిష్టంగా ఉంటుందన్నారు. తెలంగాణ పథకాలు చూసి దేశ రైతాంగం బీఆర్ఎస్ వైపు చూస్తున్నదని, సంపద పెంచాలి .. ప్రజలకు పంచాలి అన్నదే కేసీఆర్ విధానమన్నారు.

47.75 లక్షల మందికి ప్రతి నెలా ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ .. ఇందులో చిన్న, సన్నకారు రైతులు కూడా ఉన్నారని మంత్రి వెల్లడించారు. 11.55 లక్షల మందికి కళ్యాణలక్ష్మి, 12.66 లక్షల మందికి కేసీఆర్ కిట్లు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, 2014లో 298 గురుకులాలు ఉంటే నేడు 1201 గురుకులాలు ఉన్నాయన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ, ఉపాధి రంగాలలో గణనీయమైన వృద్ది సాధించామన్నారు. బీఆర్ఎస్ తో దేశ రాజకీయాల్లో కేసీఆర్ తనదైన ముద్ర వేయడం ఖాయమని మంత్రి నిరంజన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్