Raj Bhavan Complaints Box :
సలహాలు, కంప్లైంట్స్ కోసం రాజ్ భవన్ ముందు గవర్నర్ తమిళిసై న్యూ ఇయర్ రోజు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ బాక్స్ కు మంచి స్పందన వస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే 50 ఫిర్యాదులు వచ్చాయి. కంప్లైంట్ బాక్స్ ఫిర్యాదులను గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్ పరిశీలిస్తున్నారు. డైలీ సాయంత్రం బాక్స్ ఓపెన్ చేసి మరుసటి రోజు ఉదయం ఫిర్యాదులను సంబంధిత డిపార్ట్ మెంట్ కు పంపిస్తామని ఆయన తెలిపారు. ఆన్ లైన్ చదువుల కోసం ల్యాప్టాప్ కావాలని ఓ స్టూడెంట్ బాక్స్ ద్వారా కోరారని, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు.
రానున్న రోజుల్లో కంప్లైంట్ బాక్స్ కు ఫిర్యాదులు పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉద్యోగుల విభజన, 317 జీవో, కొత్త జోనల్ సిస్టం, రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, జాబ్ నోటిఫికేషన్లు, ధరణి సమస్యలు, రుణమాఫీ, అధికారులపై ఫిర్యాదులు, వివిధ ప్రభుత్వ స్కీమ్ లలో లోపాలు, అధికారుల వేధింపులు, విద్యార్ధి సంఘాల నుంచి ఫిర్యాదులు వచ్చే చాన్సుంది. రాజ్ భవన్ నుంచి వచ్చే కంప్లైంట్స్ కు రిప్లై లేదా యాక్షన్ తీసుకునే అంశం అధికారులకు ఇబ్బందిగా మారే అవకాశముంది. కరోనా పేరుతో గవర్నమెంట్ ఆఫీసులు, కమిషనరేట్లు, కలెక్టరేట్లు, హైదరాబాద్ లో సెక్రటేరియెట్ లోకి విజిటర్స్ ను అనుమతించకపోవటంతో పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. వారంతా కంప్లైంట్ బాక్స్ ను ఉపయోగించుకునే అవకాశం ఉంది.
సోమవారం 49 ఫిర్యాదులొచ్చాయి. మంగళవారం ఉదయం సంబంధిత డిపార్ట్ మెంట్లకు పంపుతం. వచ్చిన ఫిర్యాదుల్లో ల్యాండ్ సమస్యలు, జాబ్ ఇష్యూలు, సర్వీస్ మ్యాటర్స్ ఉన్నయ్. రోజూ సాయంత్రం బాక్స్ ఓపెన్ చేసి ఫిర్యాదులను కేటగిరీల వారీగా డివైడ్ చేసి ప్రభుత్వ శాఖలకు పంపుతం. వీటిపై రూల్స్ ప్రకారం ఆఫీసర్లు చర్యలు తీసుకుంటారు.
Also Read : విద్యాసంస్థల మూసివేతకు తొందరెందుకు