Saturday, January 18, 2025
HomeTrending Newsగవర్నర్‌ తో సిఎం భేటి: ఎమ్మెల్సీలకు ఆమోదం

గవర్నర్‌ తో సిఎం భేటి: ఎమ్మెల్సీలకు ఆమోదం

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సిఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఆ కాసేపటికే గవర్నర్ కోటాలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఢిల్లీ పర్యటన వివరాలను కూడా సిఎం జగన్ గవర్నర్‌కు వివరించారు.

గవర్నర్‌ కోటాలో 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ సీట్ల భర్తీ కోసం లేళ్ల అప్పిరెడ్డి(గుంటూరు జిల్లా), తోట త్రిమూర్తులు(తూర్పుగోదావరి), మోషేన్‌ రాజు(పశ్చిమగోదావరి), రమేశ్‌ యాదవ్‌(అనంతపురం జిల్లా)తో కూడిన జాబితాను గవర్నర్‌కు పంపింది.

లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులుపై క్రిమినల్‌ కేసులు న్నట్లు గవర్నర్‌కు ఫిర్యాదులు అందాయని అందుకే గవర్నర్ ఈ జాబితాను పెండింగ్ లో పెట్టారని వార్తలు వచ్చాయి. ఈ విషయంలో గవర్నర్ ముఖ్యమంత్రి అభిప్రాయం అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సిఎం అభిప్రాయం తెలుసుకున్న తరువాత ఆ పేర్లకు రాజ్ భవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ముఖ్యమంత్రి జగన్ తో పాటు అయన సతీమణి వైఎస్ భారతి కూడా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ సతీమణి సుప్రవ హరిచందన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమెకు ఓ పూల మొక్క భారతి బహూకరించారు.

రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను గవర్నర్ కు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్