Sunday, January 19, 2025
Homeసినిమాసంక్రాంతికి మారుతి సినిమా నుంచి ప్రభాస్ ఫస్టులుక్!

సంక్రాంతికి మారుతి సినిమా నుంచి ప్రభాస్ ఫస్టులుక్!

ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా కాలంగా ‘సలార్’ సినిమా కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. ఆ సినిమా రావడం .. భారీ వసూళ్లను రాబడుతూ దూసుకెళుతుండటం జరిగిపోతూనే ఉంది. ఇక ఇప్పుడు అందరూ మారుతి – ప్రభాస్ ల సినిమాపై దృష్టి పెట్టారు. ఎందుకంటే నెక్స్ట్ ప్రభాస్ నుంచి రానున్న సినిమా ఇదే. అందువలన ఈ సినిమా కోసం ఆత్రంగా .. ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్ డేట్స్ ఎప్పటి నుంచి మొదలవుతాయా అనే కుతూహలాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా అప్ డేట్స్ కి క్లాప్ పడుతుందని తెలుస్తోంది.

మారుతి – ప్రభాస్ ల కాంబినేషన్ లో ఒక ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లి చాలా కాలమే అయింది. ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఒక సినిమా థియేటర్ చుట్టూ తిరిగే సూపర్ నేచురల్ థ్రిల్లర్ నే ఈ సినిమా కంటెంట్ అనే విషయం తెలుస్తోంది. చాలా గోప్యంగా ఈ సినిమా షూటింగును కానిస్తూ వెళ్లారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్స్ వదలలేదు. ‘సలార్’ రిలీజ్ తరువాతనే రంగంలోకి దిగాలని అనుకున్నారు .. అలాగే చేస్తున్నారు.

సంక్రాంతికి ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక అప్పుడే సినిమా టైటిల్ విషయంలోను ఒక క్లారిటీ రానుంది. ‘డైనోసార్ ప్రభాస్ ను చూశారు .. ఇక పండుగకి డార్లింగ్ ప్రభాస్ ను చూడటానికి వెయిట్ చేయండి’ అంటూ ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఒక పోస్టర్ ను వదిలారు. దాంతో ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండనుంది? ఏ టైటిల్ ను సెట్ చేశారు? అనేది ఆసక్తికరంగా మారింది. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, నిధి అగర్వాల్ .. మాళవిక మోహనన్ కథానాయికలుగా కనిపించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్