Saturday, January 18, 2025
Homeసినిమామహేశ్ బాబు సినిమాపై ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే!

మహేశ్ బాబు సినిమాపై ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే!

మహేశ్ బాబు హీరోగా రాజమౌళి ఒక సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఆఫ్రికా నేపథ్యంలో జంగిల్ అడ్వెంచర్ గా ఈ కథ నడవనుంది. అక్కడి ప్రముఖ రచయిత రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఆ పుస్తకం ఆధారంగా రాజమౌళి స్క్రీన్ ప్లే ఉంటుందని అన్నారు.

ఈ సినిమాలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడనే ఒక టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. రెండు పాత్రల మధ్య వైవిధ్యం గొప్పగా ఉంటుందని అంటున్నారు.  మహేశ్ బాబు ఇంతకుముందు కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపిస్తాడని చెబుతున్నారు. గతంలో ఈ సినిమా మల్టీ స్టారర్ అనే టాక్ వచ్చినప్పుడు రాజమౌళి ఖండించాడు. ఇది మల్టీస్టారర్ కాదని తేల్చేశాడు. కానీ ఇప్పుడు మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.

అయితే కథాపరంగా నిజంగానే మహేశ్ ద్విపాత్రాభినయం చేస్తాడా? లేదంటే సందర్భాన్ని బట్టి  రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడా? అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది. అప్పటివరకూ ఈ సస్పెన్స్ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఆగస్టు 9వ తేదీన మహేశ్ బాబు పుట్టినరోజు. ఆ రోజున ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమా కూడా ‘బాహుబలి’ మాదిరిగా రెండు భాగాలుగా రానుందనే టాక్ ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్