Saturday, January 18, 2025
Homeసినిమామహేష్‌ మూవీ తర్వాత జక్కన్న ప్లాన్ ఇదే!

మహేష్‌ మూవీ తర్వాత జక్కన్న ప్లాన్ ఇదే!

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో చరిత్ర సృష్టించారు. దీంతో రాజమౌళి సినిమాల కోసం టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సైతం ఆతృతగా ఎదురు చూస్తుంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి చరిత్ర సృష్టించారు. 1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు జపాన్ లో ఎప్పటి నుంచో ఉన్న ముత్తు రికార్డ్ ను క్రాస్ చేసి ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే ఇటీవల ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుని ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ నిలవడం విశేషం.

ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నానని రాజమౌళి ఎప్పుడో ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్.నారాయణ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. జూన్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మహేష్ బాబుతో చేసే సినిమా తర్వాత జక్కన్న ఎవరితో సినిమా చేయనన్నాడు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఇంతకీ విషయం ఏంటంటే… జక్కన్న పాన్ వరల్డ్ మల్టీస్టారర్ ప్లాన్  చేస్తున్నారట. డార్లింగ్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారీ మల్టీస్టారర్ కి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీన్నీ పాన్ వరల్డ్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కించి ఈ సినిమాతో మరోసారి చరిత్ర సృష్టించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మహేష్ తో హాలీవుడ్ రేంజ్ పాన్ వరల్డ్ సినిమా ఖరారైంది. అయితే.. ఈ పాన్ వరల్డ్ మల్టీస్టారర్ పైనా మరింత సమాచారం తెలియాల్సివుంది. ప్రచారంలో ఉన్నట్టు ప్రభాస్, ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తే… అది రాజమౌళి డైరెక్ట్ చేస్తే.. సంచలనమే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్