Tuesday, March 10, 2026
Homeసినిమాఆర్ఆర్ఆర్ 2 ఫిక్స్! డైరెక్టర్ రాజమౌళి కాదా..?

ఆర్ఆర్ఆర్ 2 ఫిక్స్! డైరెక్టర్ రాజమౌళి కాదా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్ సంచలన విజయం సాధించింది. మన దేశంలోనే కాకుండా.. జపాన్ లో సైతం రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. అంతే కాకుండా..  ఈ  మూవీలోని ‘నాటు నాటు’ పాట  ఆస్కార్ అవార్డ్ సాధించి చరిత్ర సృష్టించింది. ఈ సినిమా రిలీజైన తర్వాత దీనికి వచ్చిన రెస్పాన్స్ చూసి పార్ట్ 2 స్టోరీ రాయండి.. సినిమా చేద్దామని ఎన్టీఆర్  అన్నాడని విజయేంద్రప్రసాద్ అప్పట్లో చెప్పారు.

మళ్లీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని.. హాలీవుడ్ లోనే సినిమా తీసి వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని రాజమౌళి అనుకుంటున్నాడని విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్ వ్యూలో తెలియచేశారు. అయితే.. ఈ చిత్రానికి దర్శకుడుగా రాజమౌళి ఉంటారా..? లేక ఆయన దర్శకత్వం పర్యవేక్షణ చేసి దర్శకత్వ బాధ్యతలను హాలీవుడ్ డైరెక్టర్ కి అప్పగిస్తారా అనేది తెలియాల్సివుందని చెప్పారు. దీంతో ఈ వార్త వైరల్ అయ్యింది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ 2 ఫిక్స్.  డైరెక్టర్ ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. మరి.. క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular