Friday, March 20, 2026
Homeసినిమాహాలీవుడ్ మూవీకి జక్కన్న రెడీ!

హాలీవుడ్ మూవీకి జక్కన్న రెడీ!

‘స్టూడెంట్ నెంబర్ 1’ తో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి అపజయం అనేది లేకుండా వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకెళుతున్నారు రాజమౌళి. ‘బాహుబలి’ సినిమాతో బాలీవుడ్ ని ఆకట్టుకున్న రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో హాలీవుడ్ ని ఆకట్టుకున్నారు. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కు గాను అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్  అవార్డ్ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించారు. ఆస్కార్ బరిలో కూడా నిలవడం విశేషం. ఆర్ఆర్ఆర్ మూవీని చూసిన హాలీవుడ్ మేకర్స్ శభాష్ రాజమౌళి అంటూ ప్రశంసించారు.

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, అవతార్ సినిమా రూపకర్త జేమ్స్ కెమెరూన్ సైతం ఆర్ఆర్ఆర్ సినిమాను చూసి, రాజమౌళిని మెచ్చుకున్నారు. దీంతో రాజమౌళి తదుపరి సినిమా హాలీవుడ్ లోనే అనే ప్రచారం మొదలైంది. దీనికి రాజమౌళి కూడా సానుకూలంగానే స్పందించారు. హాలీవుడ్ మూవీకి దర్శకత్వం వహించాలని ప్రతి డైరెక్టర్ కి ఉంటుందని.. తనకు కూడా హాలీవుడ్ మూవీ చేయాలని ఉందన్నారు. కాకపోతే ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదన్నారు. ఈ విషయంలో ఎవరో ఒకరితో తాను కలసి పని చేయాల్సి ఉంటుందన్నారు.

ఒక సినిమాను ఎలా తీయాలో ఎవరూ నాతో చెప్పరు. బహుశా నా మొదటి అడుగు ముందుగా ఎవరో ఒకరి సహకారం తీసుకోవడం కావచ్చు అని ఓ వార్తా సంస్థతో అన్నారు. హాలీవుడ్ సినిమా తన డ్రీమ్ గా రాజమౌళి పేర్కొన్నారు. హాలీవుడ్ లో ప్రయోగం చేయడానికి తాను సిద్దంగా ఉన్నట్టు చెప్పారు. అయితే…  రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్నారు. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సంవత్సరంలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. మరి.. మహేష్‌ తో ఎలాంటి చరిత్ర క్రియేట్ చేస్తారో.. హాలీవుడ్ మూవీ ఎప్పుడు..? ఎవరితో..? చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular