Saturday, January 18, 2025
Homeసినిమారాజమౌళి క్లాప్ తో హిందీ ‘ఛత్రపతి’ ప్రారంభం

రాజమౌళి క్లాప్ తో హిందీ ‘ఛత్రపతి’ ప్రారంభం

యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ – డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కాంబినేషన్ లో ఛత్రపతి హిందీ రీమేక్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు హైదరాబాద్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై తొలి క్లాప్ ఇచ్చారు. ముహర్తపు సన్నివేశానికి రమా రాజమౌళి స్విచాన్ చేయగా, ఏ.ఎం.రత్నం గౌరవ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా రైటర్ విజయేంద్రప్రసాద్ స్ర్కిప్ట్ అందించారు.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్.. బాలీవుడ్ ఎంట్రీకి ఈ సినిమా కరెక్ట్ గా సెట్ అవుతుందని భావించాడు. అలాగే ఈ సినిమాని డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ అయితే కరెక్ట్ అని ఆయనకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. విజయేంద్ర ప్రసాద్ ఛత్రపతి రీమేక్ కోసం నార్త్ నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేశారు. టాలీవుడ్ లో ఛత్రపతి ప్రభాస్ కి ఎంత పేరు తీసుకువచ్చిందో.. బాలీవుడ్ లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు అంత పేరు తీసుకువస్తుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. తనిష్క్ బాగ్చి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై ధావల్ జయంతిలాల్ గాద, అక్షయ్ జయంతిలాల్ గాద ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్