Sunday, January 19, 2025
Homeసినిమా'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న

‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న

తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన సంచలన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా రిలీజైనప్పుడు ఎన్టీఆర్, చరణ్ అద్భుతంగా నటించారు. మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులు కోరుకుటున్నారు. అంతే కాకుండా.. ఆర్ఆర్ఆర్ మూవీకి సీక్వెల్ ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్ వ్యూలో మాట్లాడుతూ… ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ తన ఇంటికి వచ్చి.. ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేయాలని.. ఖచ్చితంగా బాగుంటుందని చెప్పాడని అన్నారు.

ఆతర్వాత ఇటీవల రాజమౌళి ఆస్కార్ అవార్డ్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో మీడియాకి ఇచ్చిన ఇంటర్ వ్యూల్లో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. మా టీమ్ కి ఓ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను డెవలప్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని చెప్పారు. తాజాగా ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డ్ వచ్చిన సందర్భంగా రాజమౌళి అమెరికాలో మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై స్పందించారు. ఇంతకీ ఏం చెప్పారంటే… ఆస్కార్ విజయం మరింత బాధ్యతను పెంచింది. ఆర్ఆర్ఆర్ సీక్వెల్కు సంబంధించిన పనుల్ని వేగవంతం చేసేలా స్ఫూర్తినిచ్చింది అన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాకి మించి ఉండేలా.. మరింత గొప్పగా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ప్లాన్ చేస్తామని రాజమౌళి చెప్పడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేయనున్నారు. ఈ సంవత్సరంలో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. 2024 అంతా షూటింగ్ చేసి 2025లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుచేత ఆర్ఆర్ఆర్ సీక్వెల్ 2025 ఎండింగ్ లో ఉండచ్చు అని టాక్ వినిపిస్తోంది. విజయేంద్రప్రసాద్ ఆర్ఆర్ఆర్ సీక్వెల్ స్టోరీ రాస్తున్నారు. మరి.. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Also Read : చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్: ‘నాటు నాటు’ కు ఆస్కార్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్