Sunday, January 19, 2025
Homeసినిమారాజమౌళి ప్రశంసలందుకున్న‌ ‘లూజర్ 2’

రాజమౌళి ప్రశంసలందుకున్న‌ ‘లూజర్ 2’

Rajamouli on Loser: ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ సిరీస్ ‘లూజర్ 2’. హిట్ సిరీస్ ‘లూజర్’కు సీక్వెల్ ఇది. తొలి సీజన్ తెరకెక్కించిన అభిలాష్ రెడ్డి… శ్రవణ్ మాదాలతో కలిసి రెండో సీజన్ తెరకెక్కించారు. జీ5, అన్న‌పూర్ణ స్టూడియోస్‌, స్పెక్ట్ర‌మ్ మీడియా నెట్‌వ‌ర్క్క్‌ నిర్మించాయి. జనవరి 21నుంచి సి సిరీస్ ‘జీ 5’ లో స్ట్రీమింగ్ అవుతోంది.

‘లూజర్’లో నటించిన న‌టించిన శ‌శాంక్‌తో క‌లిసి రాజమౌళి సెకండ్ సీజ‌న్‌ను చూశారు. సిరీస్‌తో పాటు శశాంక్ న‌ట‌న‌ను ప్ర‌శంసించారు. ఈ విషయాన్ని శశాంక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “లూజర్ 2 చూడటంతో పాటు నా నటనను ప్రశంసించినందుకు థాంక్యూ. ఓల్డ్ విల్సన్ మేనరిజమ్స్ మీకు నచ్చడం సంతోషంగా ఉంది. మీకు సిరీస్ కూడా నచ్చడం ఇంకా ఇంకా సంతోషంగా ఉంది. ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోవద్దని జాన్‌ను విల్స‌న్ మోటివేట్ చేసే సీన్ రాజమౌళి గారికి ఫెవరెట్ సీన్. అది స్ఫూర్తివంతంగా ఉందని చెప్పారు” అని శశాంక్ ట్వీట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్