Tuesday, March 10, 2026
Homeసినిమా‘ఆర్ఆర్ఆర్’  షూటింగ్ రీస్టార్ట్

‘ఆర్ఆర్ఆర్’  షూటింగ్ రీస్టార్ట్

బాహుబలి తర్వాత రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సంచలన చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే.. లాక్ డౌన్ ఎత్తేయడంతో ఈరోజు నుంచి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను జక్కన్న తిరిగి ఆరంభించారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ చిత్రానికి సంబంధించి 10 శాతం షూటింగ్ మాత్రమే మిగిలివుంది. హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ తిరిగి ప్రారంభించారు. ఈ విషయాన్ని చరణ్ కోసం ముంబై నుంచి వచ్చిన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత హైదరాబాద్ లో సినిమాల షూటింగ్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. ‘మనందరి ఫేవరేట్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ కోసం రామ్ చరణ్ కు హెయిర్ స్టైల్ చేయడం ద్వారా నేడే స్టార్ట్ అయింది’ అని అలీమ్ హకీమ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా.. చరణ్ తో దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. జులై 1 నుంచి అలియాభట్ షూటింగ్ లో జాయిన్ కానున్నారని.. ఆగష్టు మొదటివారానికి షూటింగ్ కంప్లీట్ చేయాలనేది జక్కన్న ప్లాన్ అని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular