Sunday, January 19, 2025
Homeసినిమాచ‌ర‌ణ్ క్రేజీ ప్రాజెక్ట్ ను లీక్ చేసిన రాజ‌మౌళి

చ‌ర‌ణ్ క్రేజీ ప్రాజెక్ట్ ను లీక్ చేసిన రాజ‌మౌళి

Charan with Sukumar : మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ సంచ‌ల‌న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా విడుద‌ల కాకుండానే.. చ‌ర‌ణ్ మ‌రో పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేశాడు. అదే గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తో చేస్తున్న మూవీ. దీనిని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోవ‌డం కూడా జ‌రిగింది. ఈ మూవీతో పాటు చ‌ర‌ణ్ గౌత‌మ్ తిన్న‌నూరితో కూడా ఓ సినిమా చేయ‌నున్నాడు.

అయితే.. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఈ రెండు సినిమాల‌తో పాటు రంగ‌స్థలం సినిమాతో సంచ‌ల‌న విజ‌యాన్ని అందించిన‌ డైరెక్టర్ సుకుమార్ తో కూడా చ‌ర‌ణ్ ఓ సినిమా చేయ‌నున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్తలు వ‌స్తున్నాయి. దీంతో ఈ వార్తలు నిజ‌మేనా?  లేక గాసిప్పా..? అనే సందేహం ఉండేది. ఇప్పుడు ప్ర‌చారంలో ఉన్న‌ ఆ వార్త వాస్త‌వ‌మే అని రాజ‌మౌళి క‌న్ ఫ‌ర్మ్ చేశారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇంటర్ వ్యూలు ఇస్తూ.. ఈ విషయాన్ని బయటపెట్టాడు రాజమౌళి.

త్వరలోనే సుకుమార్, రామ్ చరణ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని చెప్పారు. అంతే కాకుండా.. ఆ సినిమాలో ఓపెనింగ్ సీన్ కూడా తనకు తెలుసని రాజమౌళి బయటపెట్టాడు. తను చూసిన, త‌ను విన్న బెస్ట్ ఓపెనింగ్ సీన్స్ లో ఒకటిగా అది నిలిచిపోతుందని చెప్పారు. రాజ‌మౌళి మాట‌ల‌తో ఈ ప్రాజెక్ట్ పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి అయితే.. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వ‌స్తుంది అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే

Also Read : జూనియ‌ర్ ఎన్టీఆర్.. ఇండియ‌న్ సినిమా అదృష్టం : రాజ‌మౌళి

RELATED ARTICLES

Most Popular

న్యూస్