“అప్పుడు నేను మాట్లాడింది హిందూ పత్రికలో ఆర్టికల్ గా రాశారు. అయితే.. నేను ప్రశ్నించినప్పటికీ నాకు సరైన సమాధానం దొరకలేదు అప్పట్నుంచి ఇప్పటి వరకు. ఆ తర్వాత నేను గర్వపడేలాగా తెలుగు సినిమా అంటే ప్రాంతీయ సినిమా కాదు ఇండియన్ సినిమా అని బాహుబలి తర్వాత చెప్పారు. తెలుగు సినిమా ప్రాంతీయ సినిమా కాదు ఇండియన్ సినిమా అని చెప్పడానికి బాహుబలి 1, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు దోహద పడ్డాయి. భారతీయ సినిమా ఓ మతం అయితే, ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి. తెలుగు సినిమాను రాజమౌళి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినందుకు గర్వపడుతున్నాను. మన సినిమాను జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళిని మనం గౌరవించుకోవాలి” అన్నారు. ఆ తర్వాత చిరంజీవి రాజమౌళిని సన్మానించారు.
నాడు అవమానం.. నేడు సమాధానం..
Pride of Telugu Cinema: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య ఈ నెల 29న విడుదల కానుంది. అయితే.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీని నాడు జరిగిన అవమానానికి నేడు సమాధానం చెప్పారు. ఇంతకీ చిరంజీవి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే…
“నేను నటించిన రుద్రవీణ చిత్రానికి నేషనల్ ఇంటిగ్రిటి అవార్డు వచ్చింది. అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెళ్లాం. అక్కడ అవార్డు ఫంక్షన్ కన్నా ముందు తేనీటి విందు ఇస్తారు.. ఆ హాల్లో కూర్చొని మేము టీ తాగుతున్నాం. అక్కడ గోడకంత ఇండియా సినిమా వైభవం అని రాసి ఉంది.. పోస్టర్ల తో పాటు వారు ఎవరు అనేది బ్రీఫ్ గా రాసి ఉంది. పృద్విరాజ్ కపూర్ నుంచి దిలీప్ కుమార్, దేవానంద్, ఒక్కరేంటి అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర అలా ప్రతి ఒక్కరి ఫోటోను చాలా అందంగా చూపించారు. ఇది కదా మన కీర్తి అంటూ అనుకుంటూ పక్కన మన సౌత్ వాళ్లది ఉంటుంది కదా అని వెళ్తే నాకు సౌత్ కి సంబంధించి ఎంజీఆర్, జయలలిత కలిసి డ్యాన్స్ లు చేస్తున్న ఒక స్టిల్ వేసి కింద సౌత్ సినిమా అని రాశారు. అంతే అక్కడ ఇంకెవరి ఫోటోలు లేవు.. ఎన్టీఆర్ కానీ, ఏఎన్నార్ కానీ.. ఇటు వైపు నడిగర్ తిలకం శివాజీ గణేశన్ ఫోటో కానీ వీరెవ్వరి ఫోటోలు లేవు.. ఆ టైమ్ లో వాళ్లందరూ చాలా అవమానానికి గురయ్యారు. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని ప్రోజెక్ట్ చేసేవాళ్లు.. మిగతా భాషల సినిమాలు ఏవో ప్రాంతీయ భాషల సినిమాలుగా చూపించి విలువ ఇచ్చేవారు కాదు. నాకు అప్పటి నుంచి చాలా బాధగా అనిపించింది. మద్రాసు వచ్చి నా బాధని మీడియాతో పంచుకున్నాను”