Saturday, January 18, 2025
Homeసినిమాబాలీవుడ్ ‘ఛత్రపతి’ ఆరంభానికి రాజమౌళి

బాలీవుడ్ ‘ఛత్రపతి’ ఆరంభానికి రాజమౌళి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘ఛత్రపతి’. ఈ సినిమా వీరిద్దిరి కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిం బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది. యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను టాలీవుడ్ లో పరిచయం చేసిన వినాయక్ బాలీవుడ్ లో కూడా పరిచయం చేస్తుండడం ఓ విశేషం అయితే.. ఈ సినిమా ఇద్దరికీ హిందీలో ఫస్ట్ మూవీ కావడం మరో విశేషం.

ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాలి కానీ.. కరోనా కారణంగా ఆగింది. ఇప్పుడు జులై 16న ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ ను గ్రాండ్ గా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ ప్రారంభోత్సవానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారని సమాచారం.  హైద‌రాబాద్‌, ముంబై, బంగ్లాదేశ్‌ల‌లో షూటింగ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ‘ఛత్రపతి’కి కథను అందిచిన పాన్ ఇండియా రైటర్ విజయేంద్రప్రసాద్ బాలీవుడ్ ‘ఛత్రపతి’ కోసం కథలో మార్పులు చేశారు. ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వినాయక్.. ఇద్దరూ బాలీవుడ్ లో సక్సస్ సాధిస్తారని ఆశిద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్