Saturday, January 18, 2025
Homeసినిమామహేష్‌ మూవీలో హాలీవుడ్ స్టార్స్..?

మహేష్‌ మూవీలో హాలీవుడ్ స్టార్స్..?

మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ, క్రేజీ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియా మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఎప్పటి నుంచి సెట్స్ పైకి వస్తుంది అనేది అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ భారీ పాన్ ఇండియా మూవీ గురించి ప్రకటిస్తారా అని మహేష్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సంచలన చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్.నారాయణ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. ఈ సినిమా గురించి ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో రైటర్ విజయేంద్రప్రసాద్ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటపెట్టారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే… ఇది భారీ యాక్షన్ తో ఉండే ఆఫ్రికన్ అడ్వెంచర్ గా రూపొందనున్నట్టుగా చెప్పారు. అయితే.. కథ ఇంకా పూర్తి కాలేదన్నారు. మరి.. ఇందులో హాలీవుడ్ యాక్టర్స్ నటించనున్నారా..? అని అడిగితే.. అవును.. ఖచ్చితంగా ఇందులో హాలీవుడ్ యాక్టర్స్ నటిస్తారని చెప్పారు. అయితే.. ఇంత వరకు హాలీవుడ్ యాక్టర్స్ ను కాంటాక్ట్ చేయలేదన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని చెప్పారు.

డిసెంబర్ నుంచి ఈ మూవీకి సంబంధించిన వర్క్ షాపు స్టార్ట్ చేయనున్నారు. అందుకనే మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ నవంబర్ కి పూర్తి చేయాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న గుంటూరు కారం చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మహేష్ బాబు పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి గుంటూరు కారం చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్