Tuesday, March 10, 2026
Homeసినిమాకూతురు డైరెక్షన్ లో ‘రజనీకాంత్’?

కూతురు డైరెక్షన్ లో ‘రజనీకాంత్’?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం అన్నాత్తే. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నయనతార, కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బూ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్యాచ్ వర్క్ మిగిలివుంది. అయితే.. రజనీకాంత్ వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లారు. మూడు వారాల అనంతరం తిరిగి రానున్నారు. అయితే.. రజనీకాంత్ మరింత స్పీడుగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కొంత మంది యువ దర్శకులు రజనీ కోసం కథలు రెడీ చేయడం.. ఆయనకు వినిపించడం కూడా జరిగింది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కొత్త సినిమాను ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. దీంతో ఏ డైరెక్టర్ తో సినిమాను ప్రకటిస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఆయన కుమార్తె సౌందర్య కూడా ఓ స్టోరీ రెడీ చేశారట. ఆ కథకు రజనీ ఓకే చెప్పారని.. కుమార్తె సౌందర్య దర్శకత్వంలోనే రజనీ తదుపరి చిత్రం ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా నుంచి వచ్చిన తర్వాత ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది. మరి.. తండ్రి రజనీతో కుమార్తె సౌందర్య ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular