Tuesday, February 25, 2025
HomeTrending Newsతాళి ఘటనపై విచారణకు ఆదేశం

తాళి ఘటనపై విచారణకు ఆదేశం

తహసీల్దార్ ఆఫీస్ కు తాళి ఘటన పై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ విచారణకు ఆదేశించారు. విచారణ బాధ్యతను సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్ కు  అప్పగించగా ఈ రోజు సాయంత్రం లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. త‌మ భూమిని అధికారులు వేరే వాళ్ల పేర ప‌ట్టా జారీ చేశార‌ని ఆరోపిస్తూ పొలస మంగ అనే  మ‌హిళ …. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల తహశీల్దార్ కార్యాలయ గేట్‌కు తాళి కట్టిన ఘటన సంచలనమైంది. మానాల గ్రామంలో తమ భూమి ఇతరుల పేరుతో ఉందని, న్యాయం చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు ఆలకించలేదు.

జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్ ఆదేశాలతో ఆర్డీఓ శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో బాధితులు, అధికారులతో మాట్లాడారు. 2018 లో పట్టామర్పిడి జరిగినట్లు ప్రాథమిక విచారణ లో గుర్తించారు. దానిపై క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోనున్నారు. మంత్రి కేటిఆర్ జిల్లా కావటంతో అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద విచారణ చేపట్టింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్