Saturday, January 18, 2025
Homeసినిమాగోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రజనీ 'కూలీ'

గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రజనీ ‘కూలీ’

రజనీకాంత్ నుంచి వచ్చిన ‘జైలర్’ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షం కురిపించింది. రజనీకాంత్ స్టైల్ కి తగిన సినిమాగా .. ఆయన వయసుకి తగిన కంటెంట్ గా అంతా చెప్పుకున్నారు. యాక్షన్ పరంగానే కాదు .. ఎమోషన్స్ పరంగా కూడా ఆ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. అంతే పవర్ఫుల్ పాత్రలో ఆయనను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సినిమాగా ‘వెట్టైయాన్’ కనిపిస్తోంది. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, అక్టోబర్లో థియేటర్లకు రానుంది.

ఈ సినిమా తరువాత లోకేశ్ కనగరాజ్ తో రజనీ చేయనున్నారు. ‘విక్రమ్’ సినిమాతోనే రజనీ కళ్లలో లోకేశ్ పడ్డాడు. లోకేశ్ టాలెంట్ ను ప్రత్యక్షంగా చూసిన కమల్, ఆయనను నేరుగా రజనీ దగ్గరికి తీసుకుని వెళ్లి పరిచయం చేశారు కూడా. రజనీతో లోకేశ్ సినిమా ఉంటుందని అప్పుడే అంతా అనుకున్నారు. ఆ తరువాత కొన్ని రోజులకే ఈ ప్రాజెక్టు సెట్ అయింది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని రజనీ అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు.

జూలై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. ఈ సినిమాకి ‘కూలీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ టైటిల్ కి ఆడియన్స్ వైపు నుంచి మంచి సపోర్టు వచ్చింది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సెట్స్ పైకి వెళ్లడానికి ముందే ఈ ప్రాజెక్టు అంచనాలను పెంచుతుండటం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్