Friday, November 22, 2024
Homeసినిమాఅసలైన పాన్ ఇండియా మూవీగా 'జైలర్' 

అసలైన పాన్ ఇండియా మూవీగా ‘జైలర్’ 

రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ గురించి .. ప్రపంచవ్యాప్తంగా ఆయనకి గల ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఒకప్పుడు ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆ దగ్గరలో తమ సినిమా రిలీజ్ లు లేకుండా మిగతా భాషల్లోని హీరోలు సైతం చూసుకునేవారు. ఇప్పటికీ ఆ పరిస్థితి చాలా ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంది. క్రేజ్ విషయానికొస్తే సౌత్ లో రజనీ తరువాత స్థానంలోనే మిగతా స్టార్ లు కనిపిస్తారు. యువ దర్శకులను నమ్మి వాళ్ల చేతిలో ప్రాజెక్టులు పెట్టొచ్చనే ధైర్యాన్ని మిగతా స్టార్ లకు ఇచ్చింది కూడా రజనీనే.

రజనీ ఈ మధ్య కాలంలో సోలో హీరోగానే ఎక్కువ సినిమాలు చేస్తూ వెళుతున్నారు. అలాంటి ఆయన ఒక్కసారిగా ‘జైలర్’తో సౌత్ లో మరో కొత్త ట్రెండ్ కి తెరతీశారు. సాధారణంగా నార్త్ లో స్టార్ హీరోలలో ముగ్గురికి మించి స్క్రీన్ షేర్ చేసుకునే సినిమాలు వస్తుంటాయి. అలా కాకుండా ఒక్కో భాష నుంచి ఒక్కో సీనియర్ స్టార్ ను ఎంపిక చేసుకోవడం ఇంతకుముందు జరగలేదు. ఆ ప్రయోగం .. ఆ ప్రయత్నం ‘జైలర్’ సినిమాతో జరుగుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

సాధారణంగా ఇతర భాషల నుంచి ఓ మాదిరి స్టార్స్ ను తీసుకుని, పాన్ ఇండియా సినిమా అని చెబుతూ ఉంటారు. కానీ ‘జైలర్’ విషయంలో అలా కాదు. కోలీవుడ్ నుంచి రజనీ రంగంలో ఉంటే, కీలకమైన పాత్రలకి గాను, మలయాళం నుంచి మోహన్ లాల్ ను .. కన్నడ నుంచి శివ రాజ్ కుమార్ ను .. బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్ ను తీసుకున్నారు. అందరూ కూడా హేమా హేమీలే. అసలైన పాన్ ఇండియా సినిమా అంటే ఇది అనేది ఫ్యాన్స్ మాట. ఆగస్టు 10వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా కోసం, వరల్డ్ వైడ్ గా అంతా వెయిట్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్