Saturday, January 18, 2025
Homeసినిమాతెలుగు తెరకి మరో మలయాళ మందారం!

తెలుగు తెరకి మరో మలయాళ మందారం!

Malayala Kutti: తెలుగు తెరపై ఇతర భాషలకి చెందిన భామల జోరు ఎక్కువ. ఇక్కడి తెరపై బాలీవుడ్ భామల హవా కొనసాగుతూ ఉండేది. ఆ తరువాత మలయాళ బ్యూటీల సందడి పెరుగుతూ వచ్చింది. మలయాళ కథానాయికలు చాలా అందంగా ఉంటారు. ఇక అక్కడ సినిమాల్లో కథా బలం ఎక్కువగా ఉంటుంది. వాస్తవిక సంఘటనలకు .. సహజత్వానికి వాళ్లు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఎక్కువగా దక్కుతుంటాయి. అందువలన అక్కడి నుంచి వచ్చే వాళ్లకి నటన విషయంలో శిక్షణ అవసరం లేదు. ఎంతటి బరువైన పాత్రలనైనా  అవలీలగా చేసేస్తుంటారు.

ఈ కారణంగానే ఇటు గ్లామర్ పరంగాను .. అటు నటన పరంగాను మలయాళ కథానాయికలు ఇక్కడ ఎక్కువ గా నిలదొక్కుకుంటారు .. ఎక్కువ కాలం పాటు స్టార్ డమ్ తో  కొనసాగుతూ ఉంటారు. ప్రస్తుతం తెలుగు తెరపై తమ దూకుడును చూపిస్తున్న కథానాయికల జాబితాను తీసుకుంటే, వాళ్లలో మలయాళ బ్యూటీల పేర్లే ఎక్కువ గా కనిపిస్తాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘రజీషా విజయన్‘ పేరు కూడా చేరిపోయింది.  2016లో మలయాళ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి, తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా అవార్డును అందుకోవడం విశేషం.

ఆ తరువాత నుంచి కెరియర్ పరంగా రజీషా వెనుదిరిగి చూసుకులేదు. అక్కడ మంచి క్రేజ్ ఉన్న కథానాయకుల సినిమాలలో కనిపిస్తూ .. తన టాలెంట్ ను చాటుతూ వెళుతోంది. ధనుశ్ హీరోగా వచ్చిన ‘కర్ణన్’ సినిమాతో ఆమె కోలీవుడ్ కి పరిచయమైంది. ఆ తరువాత సూర్య ప్రధానమైన పాత్రను పోషించిన ‘జై భీమ్’లోను ఆమె నటన ఆకట్టుకుంది.  ఇక ఇప్పుడు కార్తి హీరోగా చేస్తున్న ‘సర్దార్’ సినిమాలోను నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘రామారావు ఆన్ డ్యూటీ’లోను ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో ఆమె చేసిన తొలి సినిమా ఇదే. ఈ సినిమా విడుదల కాకముందే ఇక్కడి నుంచి ఆమెకి చాలా ఆఫర్లు వెళుతున్నట్టుగా సమాచారం. ఇక ఇక్కడ రజీషా చక్రం తిప్పేస్తుందేమో చూడాలి.

Also Read :  అంజలి బాటలోనే అనన్య నాగళ్ల!

RELATED ARTICLES

Most Popular

న్యూస్